ETV Bharat / city

'సంక్షేమం పేరుతో విశాఖలో సంక్షోభం సృష్టిస్తున్నారు' - visakha news

విశాఖలో భూకబ్జాలతో సామాన్య ప్రజలను విజయసాయిరెడ్డి బెదిరిస్తున్నారని తెదేపా నేత ఆలపాటి రాజా ఆరోపించారు. రాజధాని పేరుతో రెండేళ్లలుగా విశాఖలో భూముల విలువ పెంచి అమ్మేస్తున్నారని అన్నారు.

alapati raja
మాజీ మంత్రి ఆలపాటి
author img

By

Published : Jun 14, 2021, 11:22 PM IST

సంక్షేమం పేరుతో విశాఖలో విజయసాయిరెడ్డి సంక్షోభం సృష్టిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. విశాఖ ప్రజలు విజయసాయిరెడ్డి భూకబ్జాలతో విలవిలలాడుతున్నారని ఆరోపించారు. అధికారం అండతో విశాఖ ప్రజలకు నరకం చూపిస్తున్నారని.. సుమారు 6వేల ఎకరాలకు పైగా భూ సేకరణ జరుగుతోందని విమర్శించారు. మాట వినని వారిని బెదిరిస్తున్నారని.. జగన్ రెడ్డి పాలనలో భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

కబ్జాలు చేస్తున్న విజయసాయిరెడ్డి.. ఎదుటి వారిపై నేరం మోపతూ 'దొంగే దొంగా' అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని మార్పు పేరుతో రెండేళ్లలో విశాఖ భూముల విలువ పెంచుకుని సామన్యుల నుంచి వేల ఎకరాలు లాక్కొని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎంపీగా రెండేళ్లలో విశాఖకు ఏం తెచ్చారో తెలపాలని ఓ ప్రకటనలో ఆయన్ను నిలదీశారు.

ఇదీ చదవండి:

MP RaghuRama: స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

ఈ మాస్క్ పెట్టుకుంటే కరోనా ఖతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.