విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామన్న కేంద్రం ప్రతిపాదన నేపథ్యంలో విద్యార్థులతో సంతకాల సేకరణ చేసి ప్రధానికి పంపనున్నట్టు జఠాయు యూత్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ఓ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వలన.. ఉపాధిపై కలిగే దుష్ప్రభావం, ఉక్కు పరిశ్రమ ద్వారా కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, తదితర అంశాలపై విద్యార్థులు చర్చించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి.. లాభాల బాట పట్టించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై విద్యార్థులు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇదీ చదవండి: