ETV Bharat / city

'పది'లో వికసించిన.. 'విశాఖ' విద్యా సుమాలు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

SSC TOPPERS: ఇవాళ ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో అమ్మాయిలు సత్తా చాటారు. 600 మార్కులకు గానూ 590 పైనే సాధించి బాలికలు విజయ బావుటా ఎగరేశారు.

SSC TOPPERS IN VISAKHAPATNAM
SSC TOPPERS IN VISAKHAPATNAM
author img

By

Published : Jun 6, 2022, 8:14 PM IST

SSC TOPPERS: ఇవాళ ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న శశి విద్యాసంస్థలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ప్రతిభ కనబర్చారు. చిట్టాల హరి సాత్విక అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి తన సత్తా చాటింది. ఇంగ్లీష్, సైన్స్, గణితం, తెలుగు సబ్జెక్టుల్లో నూటికి నూరుశాతం మార్కులు సాధించగా.. హిందీ, సోషల్ సబ్జెక్ట్​లో 99 మార్కులు సంపాదించింది. తల్లిదండ్రులు విజయ కుమారి, సాయికుమార్​లు వృత్తిరీత్యా ప్రైవేట్ పాఠశాల కళాశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ.. తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నారు. ఐఐఐటీ ధ్యేయంగా కృషి చేస్తానని హరి సాత్విక తెలిపింది.

విశాఖ జిల్లాలోని సంగివలస క్యాంపస్​లో బోయిన శ్రీవల్లి అనే విద్యార్థిని 600 మార్కులకుగాను 592 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే అత్యధిక ప్రతిభ కనపరిచినట్లు తెలిపింది. భవిష్యత్తులో బైపీసీలో చేరి మంచి డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. 2022 సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శశి సంస్థల చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ అభినందించారు.

తన ఉపాధ్యాయుల శ్రద్ధ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పదో తరగతి పరీక్షలలో 596 మార్కులు సాధించగలిగినట్లు విశాఖకు చెందిన కీర్తిరెడ్డి చెప్పింది. విశాఖలోని శ్రీచైతన్యలో విద్యను అభ్యసించినట్లు వివరించింది. తండ్రి సాధారణ మెకానిక్, తల్లి అనిత గృహిణి. ఐఏఎస్ చదవాలన్నది తన లక్ష్యమని తెలిపింది. పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన కీర్తిని పాఠశాల ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.