Temple inaugurated: విశాఖలో తిరుమల తిరుపతి దేవస్దానం నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ ఉదయం వృషభ లగ్నంలో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి జరిపారు. కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి చేర్చారు. వృషభ లగ్నం ఆరంభం కాగానే ఆగమోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు.
Temple inaugurated: వేద పండితులు, అర్చకుల పూజల అనంతరం.. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీనివాస కల్యాణం, తర్వాత ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. గురువారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిచనున్నారు.
ఇదీ చదవండి: Puffer Fish: ముళ్ల కప్పను ఎప్పుడైనా చూశారా?