ETV Bharat / city

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు... - Special trains updates

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

special-trains-for-pongal-festival
special-trains-for-pongal-festival
author img

By

Published : Dec 23, 2019, 11:36 PM IST

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జత చేసినట్లు రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి రాకేశ్​ తెలిపారు. విశాఖపట్టణం- సికింద్రాబాద్ మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లు విశాఖపట్టణం-సికింద్రాబాద్, విశాఖపట్టణం- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడుస్తాయని తెలిపారు. విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య 26 రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. జనవరి 7, 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయని వివరించారు.

విశాఖపట్టణం- తిరుపతి మధ్య 26 ప్రత్యేక సర్వీసులను జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపుతామని పేర్కొన్నారు. భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య 25 రైళ్లను జనవరిలో 2, 9, 16, 23, 30 తేదీల్లో.. ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో.. మార్చి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య ఒక సువిధ ఎక్స్​ప్రెస్ రైలును జనవరి 10న ఉంటుందని వివరించారు.

కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు, శ్రీకాకుళం రోడ్- తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల, తిరుపతి-కాచిగూడ మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాచిగూడ- టాటానగర్ మధ్య 25 ప్రత్యేక సర్వీసులు, కాచిగూడ-టాటానగర్ మధ్య ఒక ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్/సికింద్రాబాద్, కాజీపేట్/వరంగల్ వైపు పుష్​పుల్ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

హైదరాబాద్- కాజీపేట్, వరంగల్- హైదరాబాద్ మధ్య నడిచే పుష్​పుల్ రైలుకు అదనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. సికింద్రాబాద్- వరంగల్, మధ్య నడిచే పుష్​పుల్ రైలుకు కూడా నాలుగు అదనపు బోగీలను కలుపుతారు. అదనపు బోగీలు 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవీ చూడండి: సమరావతి.. రేపు ఉపరాష్ట్రపతితో అమరావతి రైతుల భేటీ

TG_HYD_63_23_SPECIAL_TRAINS_DRY_3182388 reporter : sripathi. srinivas ( ) సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రత్యేక రైళ్లలో కొన్నింటికి అదనపు బోగీలను జతచేసినట్లు రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. విశాఖపట్టణం-సికింద్రాబాద్ ల మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు విశాఖపట్టణం-సికింద్రాబాద్, విశాఖపట్టణం-తిరుపతి, భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తాయన్నారు. విశాఖపట్టణం-సికింద్రాబాద్ ల మధ్య 26 రైళ్లు నడిపించనున్నారు. జనవరి 7,14,21,28 తేదీల్లో, ఫిబ్రవరి 4,11,18,25 తేదీల్లో ఈ రైళ్లను నడపనున్నారు.విశాఖపట్టణం-తిరుపతిల మధ్య 26 ప్రత్యేక సర్వీసులను జనవరిలో 6,13,20,27 తేదీల్లో నడపుతామన్నారు. ఫిబ్రవరిలో 3,10,17,24 నడపనున్నారు. మార్చిలో 2,9, 16,23, 30వ తేదీల్లో నడుపుతున్నారు. భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య 25 రైళ్లను జనవరిలో 2,9,16,23,30 తేదీల్లో, ఫిబ్రవరిలో 6,13,20,27 తేదీల్లో, మార్చిలో 5,12,19,26 తేదీల్లో నడపనున్నారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య ఒక సువిధ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 10వ తేదీన నడుపుతున్నారు. కాచిగూడ-శ్రీకాకుళం రోడ్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల, తిరుపతి-కాచిగూడ మధ్య 8ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాచిగూడ-టాటానగర్ మధ్య 25 ప్రత్యేక సర్వీసులు, కాచిగూడ-టాటానగర్ మధ్య ఒక ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్/సికింద్రాబాద్, కాజిపేట్/వరంగల్ వైపు పుష్ పుల్ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్-కాజిపేట్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు అధనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. వరంగల్-హైదరాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు అధనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. సికింద్రాబాద్-వరంగల్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు సైతం నాలుగు అధనపు బోగీలను జతచేస్తున్నారు. వరంగల్ -హైదరాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు అధనంగా నాలుగు బోగీలను జతచేస్తున్నామన్నారు. అధనపు బోగీలు 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తిచేస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.