ETV Bharat / city

3TIER ECONOMY COACHES: విలాసవంతమైన త్రీటైర్‌ ఎకానమీ ఏసీ కోచ్‌లు - Three-tier economy coaches arriving in Visakhapatnam

ప్రయాణికులకు సరళమైన ధరలో.. విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు.. రైల్వే శాఖ అధునాతన సౌకర్యాన్ని కల్పించనుంది. రైళ్లలో స్లీపర్‌ తరగతిలో ప్రయాణించేవారు సైతం.. థర్డ్‌ ఏసీ కోచ్‌ల్లో వెళ్లేలా కొత్త ప్రాజెక్టు చేపట్టింది. ‘త్రీటైర్‌ ఎకానమీ’ పేరుతో.. ఆకట్టుకునే డిజైన్‌తో.. ఏసీ కోచ్‌లను తయారు చేస్తోంది. వీటిని తొలి ప్రాధాన్యంగా విశాఖకు కేటాయించగా.. తొలి కోచ్‌ అక్కడకు చేరుకుంది.

Three Tier Economy
త్రీటైర్‌ ఎకానమీ
author img

By

Published : Aug 24, 2021, 4:31 PM IST

Updated : Aug 24, 2021, 8:11 PM IST

త్రీటైర్‌ ఎకానమీ పేరుతో ఏసీ కోచ్‌ల తయారీ

ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. త్రీటైర్‌ ఏసీ ఎకానమీ కోచ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కోచ్‌లు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఐఎఫ్​సీ, కపుర్తలలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఆర్​ఎఫ్​సీలో తయారవుతాయి. చెన్నైలో తయారైన తొలి కోచ్‌ను విశాఖకు పంపారు. వీటిని లింక్‌హాఫ్‌మన్‌ బుష్చ్‌ ఎల్​హెచ్​బీ కోచ్‌లుగా ఉన్నతీకరించి ఆ తర్వాత థర్డ్‌ ఏసీ కొత్త కోచ్‌లుగా మార్చనున్నారు. మరిన్ని కోచ్‌లను కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫైర్‌ ఫ్రూఫ్‌ సీట్లు..

కొత్త త్రీటైర్ ఏసీ ఎకానమీ కోచ్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విలాసంగా కనిపించేలా సీట్లను డిజైన్ చేశారు. అగ్నిప్రమాదాలకు తావులేకుండా ఫైర్‌ ఫ్రూఫ్‌ సీట్లు ఏర్పాటు చేశారు. ప్రతీ సీటుకూ శీతల కవాటాలను పెట్టి.. అవసరం ఉన్నప్పుడు తెరిచేలా, అవసరం లేనప్పుడు మూసేలా ఏర్పాట్లున్నాయి. ప్రతీ సీటు దగ్గర ఛార్జింగ్ పాయింట్‌, అలాగే మొబైల్ హోల్డర్ ని ఉంచారు. అలాగే ప్రతీ సీటుకూ ఎల్​ఈడీ రీడింగ్ లైట్​ను ఉంచారు. గంటకు 160కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని తట్టుకునేలా కోచ్‌లను రూపొందించారు. ఉన్నతీకరించిన అధునాతన డిజైన్‌తో ఈ కోచ్‌లు ప్రయాణికులను ఆకట్టుకుంటాయని అధికారులు అంటున్నారు.

త్రీటైర్‌ ఎకానమీ కోచ్‌..

దేశవ్యాప్తంగా అనేక రైళ్లకు.. త్రీటైర్‌ ఎకానమీ కోచ్‌లను పెంచేందుకు రైల్వే బోర్డు దృష్టి సారించింది. ఇందులోభాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 344, కపుర్తలలోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 250 కోచ్‌లను తయారు చేయిస్తోంది. అంతకుముందు నమూనా కోచ్‌ను కపుర్తలలో తయారు చేయగా.. ఇప్పుడున్న నమూనాను.. రీసెర్చి డిసైజ్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (RDSO) రూపొందించింది. దీన్ని పరీక్షించిన రైల్వేబోర్డు ఈ ఏడాది అనుమతి ఇచ్చింది. ఇవి ఉపయుక్తంగా ఉండటంతో.. సరఫరాను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం గరీబ్‌రథ్‌ రైళ్లలో మాత్రమే తక్కువ ధరలో ఏసీ ప్రయాణం అందుబాటులో ఉంది. త్రీటైర్‌ ఎకానమీ కోచ్‌ల రాకతో ఇతర రైళ్లలోనూ ఈ తరహా ప్రయాణాలు సాధ్యం కానున్నాయి. ఈ ఏసీ కోచ్‌ల్లో తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చునని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండీ.. Young farmer: ఎనిమిదిన్నర గంటల్లో.. 18 ఎకరాల అంతర సేద్యం!

Last Updated : Aug 24, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.