ETV Bharat / city

Development works: పేరుకే స్మార్ట్ వార్డ్.. కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడే లేదు..!

author img

By

Published : Aug 23, 2021, 1:53 PM IST

విశాఖలోని పెదజాలరిపేట.. సముద్ర తీరానికి ఒడ్డునే ఉన్నా, అభివృద్ధికి మాత్రం ఏళ్లతరబడి చాలా దూరం. నగరంలో ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ మత్స్యకార కుటుంబాలు చాలా ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అలాంటి ప్రాంతాన్ని ‘స్మార్ట్‌సిటీ మిషన్‌’ కింద వృద్ధి చేయాలనే ఆలోచనకు వచ్చినా.. పనుల ఆలస్యంతో, అరకొరగా జరిగిన పనులతో ఇప్పుడా ప్రాంతవాసులు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

Smartcity works
పెదజాలరిపేటలో స్మార్ట్‌సిటీ పనులు

విశాఖలో ప్రాంత ఆధారిత అభివృద్ధి (ఏరియా బేస్డ్‌ డెవలప్‌మెంట్‌)లో భాగంగా స్మార్ట్‌సిటీలో 30 రకాల ప్రాజెక్టుల్ని చేపడుతున్నారు. కాలువల్ని వృద్ధి చేయడం, అసంపూర్తి వరదనీటి కాలువల్ని పూర్తి చేయడం, మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించడం, తాగునీటి వసతిని పెంచడం, సోలార్​ విద్యుద్దీపాలు అమర్చడం, దారుల్ని స్మార్ట్‌స్ట్రీట్‌లుగా మార్చడం, భూగర్భ విద్యుత్తు వ్యవస్థను తీసుకురావడం.. వంటి కార్యక్రమాలు స్మార్ట్‌ సిటీలో ఉన్నాయి. వీటన్నింటినీ పెదజాలరిపేటలోనూ చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. కానీ ఇప్పటికీ పూర్తి ఫలితాలు రాకపోవడంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న అక్కడి ప్రజలు మరింత వేదన అనుభవిస్తున్నారు.

పాఠశాలలో పూర్తి స్థాయి విద్య ఏది..

విశాఖలోని పెదజాలరిపేటలో సుమారు 5వేల కుటుంబాలు నివాసముంటున్నాయి. సముద్రంలోకి వెళ్లడం, చేపలు పట్టుకుని జీవనం సాగించడం.. వీరి నిత్యపోరాటం. కనీస మౌళిక వసతులు లేకపోవడంతో ఇన్నేళ్లు పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు అనుభవించారు. అభివృద్ధి పథకాలు వీరికి పెద్దగా అందటంలేదు. విద్యార్థులకు పాఠశాల విద్య కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు.

దెబ్బతిన్న రోడ్లకు పైపూతలు..

స్మార్ట్‌సిటీ పనులు ఈ ప్రాంతంలో చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నిధులు లేక, గుత్తేదారులు ముందుకు రావడంలేదని, కొవిడ్‌ సమస్యలని.. ఇలా అధికారులు పలు కారణాలు చెబుతూ వస్తున్నారు. వీధికి మధ్యలో భూగర్భ మురుగు వ్యవస్థకోసం, వీధికి రెండు చివర్ల భూగర్భ విద్యుత్తు కోసం తవ్వారు. చాలావీధుల్లో ఈ పనులు అరకొరగానే ఉన్నాయి. తవ్విన వీధుల్లో త్వరగా పనులు పూర్తిచేసి రోడ్లు వేయాల్సిఉన్నా.. అధికారులు పట్టించుకొవటం లేదు. రోడ్లు దెబ్బతిన్న చోట్ల పూతలు వేసి ఉంచగా, మరికొన్నిచోట్ల మట్టితో పూడ్చి వదిలేశారు. దీంతో వీధుల్లో దుమ్ముధూళి ఎక్కువవుతోంది. దాదాపు అన్ని వీధుల్లో సోలార్​ విద్యుద్దీపాల్ని ఏర్పాటుచేశారు. వాటిలో కొన్ని పనిచేయడంలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

తీరని పారిశుద్ధ్య సమస్యలు..

జీవీఎంసీ ఈ ప్రాంతాన్ని స్మార్ట్‌వార్డుగా ప్రకటించింది. కానీ ఇప్పటికీ పారిశుద్ధ్య సమస్యలు తీరడంలేదు. ఈ ప్రాంతంమీదుగా వెళ్లే వరదకాలువలో పెద్దఎత్తున చెత్తచెదారాలు కొట్టుకొచ్చి సముద్ర తీరమంతా వ్యాపిస్తున్నాయి. ఆ వ్యర్థాలు గాలికి పెదజాలరిపేట వీధుల్లోకి వస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా ఉన్న ఈ సమస్యను జీవీఎంసీ ఇప్పటికీ తీర్చలేకపోతోంది. కాలువలు చాలాచోట్ల అస్తవ్యస్తంగానే ఉన్నాయి. భూగర్భ మురుగువ్యవస్థ కోసం వీధుల్లో నిర్మాణాలు చేపట్టినా.. ఇప్పటికీ చాలావీధుల్లో ఇళ్లకు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. ఆ మురుగంతా వీధులద్వారా సముద్రంలోకి వెళ్తోంది. మరోపక్క స్మార్ట్‌సిటీ పనుల జాప్యం వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. నవంబరులోపు అన్నిపనులూ పూర్తయ్యేలా చేస్తామని, పెదజాలరిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వారంటున్నారు.

ఇదీ చదవండీ.. సిగరెట్లు అమ్మేవారికి హెచ్చరిక.. ఇకపై ఆ ప్రాంతాల్లో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.