ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా... వారి సమస్యలపై తాను స్పందిస్తానని సభాపతి తమ్మినేని సీతారాం ఉద్ఘాటించారు. విశాఖ బాల ప్రాంగణంలో జరిగిన సదస్సుకు హాజరైన తమ్మినేని... మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్య గురించి... ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై స్పందించడంలో తప్పేముందని ప్రశ్నించారు. వల్లభనేని వంశీ పార్టీ మారడంపై స్పందిస్తూ... ఆయన ఎందుకు అ నిర్ణయం తీసుకున్నారో వివరించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే... ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శీతాకాల శాసనసభ సమావేశాల్లో... ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చ జరుపుతామని వివరించారు.
ఇదీ చదవండీ... రైల్వే టికెట్ ధరలు పెంపు... ఎందుకు? ఎంత?