ETV Bharat / city

పేటెంట్ దక్కించుకున్న కాంపౌండ్ పారాబొలిక్ సౌర కుక్కర్

వినూత్న ఆలోచనతో విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యోగి తయారు చేసిన కాంపౌండ్ పారాబొలిక్ సౌర కుక్కర్ పేటెంట్ దక్కించుకుంది. సౌరశక్తితో పనిచేసే కుక్కర్ రుచికరమైన ఆహారాన్ని మాత్రమే కాదు.. ఆహారంలోని పోషకాలు పోకుండా వండి పెడుతుంది. ఇప్పటివరకు నమూనాగా అందరినీ అబ్బురపరిచిన ఈ సౌర కుక్కర్​ను మార్కెట్​లోకి తెచ్చే సన్నాహాలను చేస్తున్నారు.

Solar cooker got Patent Right prepared by visakha steel plant employee
పేటెంట్ దక్కించుకున్న కాంపౌండ్ పారాబొలిక్ సౌర కుక్కర్
author img

By

Published : Oct 16, 2020, 10:47 PM IST

విశాఖకు చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆంజనేయశర్మ ప్లాంట్​లో డీజీఎం హోదాలో పనిచేస్తున్నారు. తనకున్న ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పర్యావరణహితంగా ఓ కుక్కర్​ను తయారు చేశారు. సౌరశక్తిని వినియోగించే దిశగా చేసిన పరిశోధనల ఫలితాన్ని మేథో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఆంజనేయశర్మ తయారు చేసిన సౌర కుక్కర్ పేటెంట్ సాధించింది. సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే అంశానికి కొత్తదనాన్ని జోడిస్తూ తయారు చేసిన సౌర కుక్కర్ ఆకట్టుకుంటోంది.

సూర్య వెలుగుల్ని ప్రతిబింబిస్తున్న ఈ అద్దాల వరుస వెనుక పదేళ్ల శ్రమ ఉంది. ఆంజనేయశర్మ తయారు చేసిన పారాబొలిక్ సోలార్ కుక్కర్ నమూనా ఇది. విభిన్న దశల్లో జరిపిన పరిశోధనల అనంతరం ఇప్పుడు మనం చూస్తున్న ఈ సోలార్ కుక్కర్ తయారైంది. ఎండలో అద్దాలను ఉంచి వాటి ద్వారా కాంతి కిరణాలను ఒక ప్రదేశంపైకి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో థర్మల్ ఇన్సులేటెడ్ పెట్టెను వినియోగిస్తున్నారు. పెట్టెలో ఎక్రిలిక్ సిలికాన్ పూత పూయడం ద్వారా గిన్నెలో ఉంచిన ఆహార పదార్థాలు ఉష్ణ శక్తిని గ్రహించి పెట్టెలోని పదార్థాన్ని ఉడికిన ఆహారంగా మారుస్తోంది.

ఈ కుక్కర్ కోసం వినియోగించిన పరిజ్ఞానాన్ని వివరిస్తూ ఆంజనేయశర్మ ఆంగ్లంలో ఓ పుస్తకాన్ని రాశారు. జర్మనీకి చెందిన లాంబెర్ట్ ప్రచురణ సంస్థ జర్మన్​తో పాటు కొరియా, జపనీస్, ఫ్రెంచ్ తదితర భాషల్లో అనువదించి ముద్రించింది. ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ సోలార్ కుక్కర్ తయారీని ఓ పరిశ్రమగా అభివృద్ధి చేయాలని ఆంజనేయశర్మ భావిస్తున్నారు.

ఇదీ చదవండీ...

ప్రభుత్వ రికార్డుల్లో లేని గ్రామం... ఈటీవీ చొరవతో వెలుగులోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.