అప్పన్న దేవాలయంలో చందనోత్సవం రోజున ఒక భక్తుడిని లోనికి అనుమతించిన విషయంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. దీనిపై కమిటీ వేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.
విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా ఓ భక్తుడిని దర్శనానికి తీసుకువెళ్లిన ఘటనలో ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులుని ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని.. విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలని దేవస్థానానికి సూచించింది.
దీంతో ఓ కమిటీని నియమించారు. నేడు ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ తెలిపింది. స్వామికి చెందిన భూముల్లో అవకతవకలు జరిగాయని తమకు ఫిర్యాదులు రావడంతో దానిపైన తగు విచారణ చేస్తామని అధికారి చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థాన స్థలంలో చేపట్టిన దేవస్థానం ఉద్యోగుల యూనియన్ బిల్డింగ్ నిర్మాణం పై పలు ఫిర్యాదులు రావడంతో ఆ నిర్మాణం పై కూడా విచారణ చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: మనలా ఎవరూ స్పందించలేదు: సీఎం జగన్