స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. అరకు ప్రాంతంలో గిరిజనులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ పరాజయం చెందితే పథకాలు నిలిపివేస్తామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల మాటలతో, మరికొన్నిచోట్ల చేతలతో ప్రతిపక్షాలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు. ఏకపక్షంగా ఏకగ్రీవమైన స్థానాలు గుర్తించి ఆ ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు.
ఇదీ చదవండి: