ETV Bharat / city

జ్ఞానాపురంలో వాణిజ్యపరంగా అభివృద్ధి..తూర్పు రైల్వేకోస్తా నిర్ణయం

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఎనిమిదో ప్లాట్‌ఫామ్‌ వైపు ఉన్న జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ కూడా సిద్ధం చేసింది. ఇక్కడున్న భూముల్ని మల్టీమోడల్‌ ప్రాజెక్టు కోసం కేటాయించేందుకు వేగంగా చర్యలు జరుగుతున్నాయి.

విశాఖ రైల్వేస్టేషన్​లో అభివృద్ధి పనులు
విశాఖ రైల్వేస్టేషన్​లో అభివృద్ధి పనులు
author img

By

Published : Aug 28, 2021, 11:34 AM IST

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఎనిమిదో ప్లాట్‌ఫామ్‌ వైపు ఉన్న జ్ఞానాపురం వైపు రైల్వే స్థలాల్లోని కొంత భూమిలో వాణిజ్య అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ బాధ్యతను రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ)కు అప్పగించారు. రైల్వేస్టేషన్‌ బయట ఉన్న భూముల్ని ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ప్రస్తుతం ఆ సంస్థ డిజైన్లను రూపొందిస్తోంది. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రైవేటు సంస్థకు బాధ్యతలు

విశాఖ రైల్వేస్టేషన్‌ పరిసరాలను వాణిజ్య అవసరాల కోసం కేటాయించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. 2017లోనే ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. అప్పట్లో లీజు వ్యవహారంలో గుత్తేదార్లకు, రైల్వే అధికారుల మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో ప్రాజెక్టు మరుగునపడింది. అనంతరం ఈ బాధ్యతను ఆర్‌ఎల్‌డీఏ తీసుకుంది. ప్రైవేటు సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించి, లీజుకు ఇవ్వడంతో పాటు వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తుదిదశకు పనులు..

దుకాణ సముదాయాలు, హోటళ్లు, ఇతర విశ్రాంతి గదులతో పాటు పలు రైల్వే కార్యాలయాలను కూడా నిర్మించాలని ఆర్ఎల్​డీఏ నిర్ణయించింది. ఈ భవానాల ద్వారా ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించడంతో పాటు రైల్వేకు ఆదాయం తెచ్చే వనరుగా వాడుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రూ.10కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ పునరాభివృద్ది పనులు... ప్రస్తుతం తుదిరూపునకు వచ్చాయి.

  • రైల్వేస్టేషన్‌లోని 3వ గేటును ఆధునికీకరించారు. భవనాలకు రంగులద్దారు. వివిధ డిజైన్లతో అద్దాలను ఏర్పాటుచేశారు.
  • 10 విశ్రాంతి గదుల్లో తొమ్మిదింటిని పునర్నిర్మించారు. గాంధీ స్మృతిలో భాగంగా ఆయన జీవిత విశేషాలతో పలు కళారూపాల్ని రైల్వేస్టేషన్‌ ముందు ప్రదర్శిస్తున్నారు.
  • ప్రయాణికులు మంచినీళ్లు తాగేందుకు కుళాయిలు, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. అందమైన ఫౌంటైన్​లను నిర్మించారు.
  • 2-3, 4-5 ప్లాట్‌ఫామ్‌లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి రెండు లిఫ్టులు కూడా వినియోగంలోకి రానున్నాయి.

ఇదీచదవండి.

TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.