విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ. సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చిన ఆమెను.. వచ్చేసారి ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలంటూ వేద పండితులు ఆశీర్వదించారు. సింధుకు అధికారులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ప్రసాదం అందజేశారు.
ఆలయ మర్యాదలతో ఆమెను సత్కరించారు. దేశానికి వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలను అందించిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించిన సింధు.. మూడోసారి సైతం మెడల్ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: