ETV Bharat / city

'విశాఖ మెట్రో రైల్‌ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయండి' - విశాఖ మెట్రో రైలుపై సీఎం జగన్ ఆదేశాలు

విశాఖ మెట్రో రైల్‌ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే విశాఖకు తాగునీటి సరఫరాపై కార్యాచరణ తయారుచేయాలని చెప్పారు. విజయవాడ, గుంటూరులో చేపట్టిన డ్రైనేజీలు సత్వరం పూర్తి చేయాలని సూచించారు.

cm jagan
cm jagan
author img

By

Published : May 27, 2020, 10:34 PM IST

విశాఖ మెట్రో రైల్‌ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా వల్ల ఆలస్యమైందని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు బదులిచ్చారు. పట్టణాలు, నగరాల్లోని ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి బొత్స, పురపాలకశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

అమృత్‌ పథకం కింద రూ.3,762 కోట్లతో పనులు చేపట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ పూచీకత్తుతో బ్యాంకుల నుంచి రూ.800 కోట్ల రుణం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడ, గుంటూరులో చేపట్టిన డ్రైనేజీలు సత్వరం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

విజయవాడ కాల్వల్లో చెత్త వేయకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖకు తాగునీటి సరఫరాపై కార్యాచరణ తయారుచేయాలని సీఎం ఆదేశించారు. విశాఖ, కాకినాడ, తిరుపతిలో రూ.4,578 కోట్ల విలువైన పనులు చేపట్టామన్న సీఎం... స్మార్ట్ సిటీ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనాభా లక్ష దాటిన పట్టణాల్లో 10,666 కోట్ల రూపాయలతో డ్రైనేజీ పనులకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

50 పట్టణాల్లో తాగునీటికి రూ.5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ పట్టణాలకు వెళ్లేదారిలో 111 గ్రామాలకూ తాగునీరు ఇవ్వాలని చెప్పారు. వీటితోపాటు టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జులై 8న రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

'ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి తీరుతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.