ETV Bharat / city

ఏయూలో 'గాంధీయన్ కమ్యూనికేషన్​'పై ఓరియంటేషన్​ కోర్సు.. పోస్టర్​ విడుదల

Orientation Course at AU: విశాఖలోని ఏయూలో గాంధీయన్ కమ్యూనికేషన్​పై రెండు వారాలపాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించనున్నట్లు వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్​ను వీసీ విడుదల చేశారు.

Orientation Course on Gandhian Communication in AU

author img

By

Published : Jul 5, 2022, 5:20 PM IST

Orientation Course on Gandhian Communication at AU: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం(AU)లోని గాంధీయన్ స్టడీస్ సెంటర్ ద్వారా 'గాంధీయన్ కమ్యూనికేషన్​'పై రెండు వారాలపాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించనున్నారు. ఆ ఓరియంటేషన్‌ కోర్సుకు సంబంధించిన పోస్టర్‌ను వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. విద్యార్థులకు గాంధేయ కమ్యూనికేషన్ పద్ధతులపై అర్థవంతంగా బోధించాలని వీసీ సూచించారు. వివాదాలను పరిష్కరించడంలో గాంధీయన్ కమ్యూనికేషన్ మరింత ప్రభావవంతంగా ఉంటుందన్నారు.

అనంతరం కోర్సుకు సంబంధించిన వివరాలను ఏయూలోని గాంధీయన్​ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చల్లా రామకృష్ణ వెల్లడించారు. ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమేనని.. ఉచితంగా, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి బ్యాచ్‌లో ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన 30 మంది విద్యార్థులను తీసుకుంటామన్నారు. విద్యార్థులు నమోదు, ఇతర సమాచారం కోసం ఆంధ్రా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భవనంలోని గాంధీయన్ స్టడీస్ సెంటర్​లో సంప్రదించాలని చల్లా రామకృష్ణ సూచించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.