విశాఖ తెదేపా కార్యాలయంలో జీవీఎంసీ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ తెదేపా పక్షనేతగా పిల్లా శ్రీనివాస్‌ను ఎన్నుకొన్నారు. ఈ నెల 9న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అనుసరించాల్సిన విధివిధాలపై అవగాహన కల్పించారు. కార్పొరేషన్లో స్టీల్ ప్లాంట్ సమస్య, నగర అభివృద్ధి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర విస్తరణ.. వంటి అంశాలు చర్చించనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం మహా నగర పాలక సంస్థలో ప్రతిపక్ష పాత్రను తెదేపా సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెదేపా పక్షనేతగా పిల్లా శ్రీనివాస్ చెప్పారు. తెదేపా కార్పొరేటర్లకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.
ఇదీ చదవండీ... తిరుపతి ఉపఎన్నిక: నకిలీ ఓటరు కార్డుల కలకలం