ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖలోని బాజీ జంక్షన్ నుంచి గోపాలపట్నం వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొనడంతో.. పాతగోపాలపట్నం నివాసి సెల్లూరి యాదవరావు తలకు తీవ్ర గాయమైంది. మోర్ దుకాణం సమీపంలోని బీఆర్టీఎస్ రహదారిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి వారు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా గుర్తించామని తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖలో క్రైం చేయాలంటే.. నేరస్తులు ఆలోచించాల్సిందే..!