అకారణంగా పెన్షన్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారంటూ విశాఖ జీవీఎంసీ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నిరసనకు దిగారు. వెంటనే తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీరికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మద్దతు తెలిపారు. అర్హులకులకు న్యాయం జరిగే పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
ఆందోళన వద్దు...
పింఛన్లు తొలగింపుపై లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని వీఎంఆర్డీఎ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తెలిపారు. అర్హులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగదని అన్నారు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :