మారువేషంలో ఉత్తరాంధ్ర మీదుగా పారిపోతున్న ఓ పాక్ ఉగ్రవాదిని రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారన్న సమాచారం సంచలనం రేపుతుంది. ముంబయి నుంచి కోల్కత్తా వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న అధికారి... అనుమానితుడు ఉగ్రవాదని పసిగట్టారు. సమాచారాన్ని ఎన్ఐఏ సంస్థకు చేరవేశారు. ఉగ్రవాది ప్రయాణించిన లారీ సమాచారాన్ని విశాఖ పోలీసులకు అందజేశారు. అప్పటికే లారీ విశాఖ జిల్లా దాటిపోవటంతో.. శ్రీకాకుళం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. నిన్న అర్ధరాత్రి సోదాలు చేస్తుండగా ఉగ్రవాది ప్రయాణిస్తున్న లారీని పోలీసులు గుర్తించారు.
ఈ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అనుమానిత ఉగ్రవాది పాక్ ఏజెంట్గా భావిస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్టు సమాచారం. అనుమానిత వ్యక్తిని విశాఖకు తీసుకువచ్చి...రహస్యప్రదేశంలో ఎన్ఐఏ విచారిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసు అధికారులు, ఎన్ఐఏ వర్గాలు ఇంతవరకు ఎటువంటి ధృవీకరణ చేయలేదు.
ఇదీ చదవండి :