ETV Bharat / city

థ్యాంక్యూ సముద్ర సేతు..! - సముద్ర సేతు ఆఫరేషన్

'మాల్దీవుల్లో చిక్కుకున్న మమ్మల్ని దేశానికి తీసుకువస్తున్నందుకు నేనెంతో రుణపడిఉన్నా. గర్భిణీ అయిన నన్ను వైద్యుల పర్యవేక్షణలో... నౌకలో తీసుకువస్తున్నారు. ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపిన మాకు ధైర్యం చెప్పి దేశానికి తరిలిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రాణాలు నిలబెట్టిన నావికాదళానికి మరోసారి థ్యాంక్యూ!' అని ఓ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయుల్ని దేశానికి తీసుకువచ్చేందుకు నావికాదశం సముద్రసేతు ఆఫరేషన్ ప్రారంభించింది.

థ్యాంక్యూ సముద్ర సేతు!
థ్యాంక్యూ సముద్ర సేతు!
author img

By

Published : May 10, 2020, 7:33 PM IST

థ్యాంక్యూ సముద్ర సేతు!

సముద్రానికి ఆవల... ఎక్కడో చిన్న దీవిలో... ఓవైపు కరోనా.. మరోవైపు ఆకలికేకలు. కరోనా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న సమయం. దేశాలు సరిహద్దులు మూసేసి నివారణ చర్యలు చేపట్టిన తరుణం. పొట్టకూటి కోసమో.. చదువు కోసమో.. దేశం కాని దేశం వెళ్లి లాక్​డౌన్​ వల్ల వందలాది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం కదిలింది.

మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సముద్రసేతు ప్రారంభించింది. నావికాదళం రెండు యుద్ధ నౌకల్లో వారందరినీ దేశానికి తరలించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఐఎన్​ఎస్ జలాశ్వ సాగరజలాలపై ముందుకు కదిలింది.

మాల్దీవుల్లో చిక్కుకున్న వారిలో 698 మందిని కేరళలోని కొచ్చికి చేర్చింది. నౌకలో దేశానికి వస్తున్న మహిళ ఓ వీడియో ద్వారా నావికాదళానికి కృతజ్ఞతలు చెప్పారు. గర్భిణీ అయిన తనను ఎంతో జాగ్రత్తగా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో దేశానికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:

కొచ్చికి చేరుకున్న ఐఎన్​ఎస్​ జలాశ్వ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.