రైల్వే ఉద్యోగులు, క్రీడాకారుల కోసం తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ నూతన జిమ్‌ను ప్రారంభించింది. విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన భవనాన్ని నిర్మించి అందులో అత్యాధునిక వ్యాయామ సామగ్రితో పాటు యోగా, ఏరోబిక్స్, వెయిట్‌లిప్టింగ్ వంటివి చేసుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ జిమ్‌ను వాల్తేర్ డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీవాస్తవ సమక్షంలో తూర్పుకోస్తా రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు షాలిని శ్రీవాస్తవ ప్రారంభించారు. వాల్తేర్ డివిజన్లో క్రీడలకు, క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని డీఆర్ఎం పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... మరిన్ని హంగులు జోడించి.. రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలు