ఆర్థిక అవసరాల నిమిత్తం యాప్‌ల ద్వారా రుణాలను తీసుకుని వేధింపులకు గురయ్యే బాధితులు పోలీసు స్టేషన్లలో ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని సీసీఎస్ ఏసీపీ శ్రావణ్‌కుమార్ చెప్పారు. విశాఖలోని సైబర్ పోలీసుస్టేషన్‌లో సీఐ చౌదరితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గాజువాక, 2వ పట్టణ పోలీసుస్టేషన్‌తో పాటు సైబర్ స్టేషన్‌లో రుణయాప్‌లకు సంబంధించి ఫిర్యాదులు అందాయని చెప్పారు.
పేయింగ్ గెస్టు వ్యాపారం సాగించే గోపాలపట్నం వాసి సత్యనారాయణ... కొవిడ్ నేపథ్యంలో ఆర్థిక అవసరాల నిమిత్తం సుమారు 50 రుణ యాప్‌ల ద్వారా రూ.4 లక్షల వరకు రుణం తీసుకున్నాడని, వీటిలో 90 శాతం తిరిగి చెల్లించాడని తెలిపారు. మిగిలిన సొమ్ముకు గడువు కోరినా ఇవ్వకుండా, యాప్‌ల నిర్వాహకులు కాల్ సెంటర్ల ద్వారా వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: