ETV Bharat / city

కుంభమేళాలో కొనసాగుతున్న విశాఖ శారదాపీఠం సేవలు - Kumbh Mela

కుంభమేళాలో విశాఖ శ్రీ శారదాపీఠం సేవలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది సాధువులు, మాతాజీలకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వాత్మానందేంద్ర స్వామి కోరారు.

కుంభమేళాలో కొనసాగుతున్న విశాఖ శారదాపీఠం సేవలు

author img

By

Published : Mar 2, 2021, 3:06 PM IST

హరిద్వార్ కుంభమేళాలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన సేవలు కొనసాగుతున్నాయి. శాంతిపుంజ్ ఎదురుగా ఉన్న కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమంతో పాటు.. హర్ కీ పూడి ఘాట్ సమీపంలోనూ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధుసంతులతో పాటు జయరామ్ ఆశ్రమ్, నిరంజన్ అఖాడా, అగ్ని అఖాడాల నుంచి వచ్చిన అనేక మంది సాధువులు, మాతాజీలకు భోజన వసతి కల్పించారు.

హర్ కీ పూడి ఘాట్ సమీపంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ఆదేశాల మేరకు.. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్న ప్రసాద వితరణ కొనసాగుతోంది. దక్షణాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులంతా ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వాత్మానందేంద్ర స్వామి కోరారు.

ఇదీ చదవండీ... ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుంది?: సుప్రీం కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.