ETV Bharat / city

OFFICIALS ON HIGH ALERT: తుపాను హెచ్చరికలతో ఉత్తరాంధ్ర అధికారుల అప్రమత్తం - తాజా వాతావరణ వార్తలు

OFFICIALS ON HIGH ALERT: ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో అక్కడి అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. జిల్లాల కలెక్టర్లు వాస్తవ పరిస్థితులను నేరుగా పరిశీలిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

OFFICIALS ON HIGH ALERT
OFFICIALS ON HIGH ALERT
author img

By

Published : Dec 2, 2021, 11:00 PM IST

OFFICIALS ON HIGH ALERT: తుపాను ప్రభావం విజయనగరం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని ఆమె ఆదేశించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర ప్రాంత గ్రామాలను పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులందరూ వెనక్కి రావాలని స్పష్టం చేశారు. చేపల కంచేరు తీరంలో సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారులను వెనక్కి రప్పించి పడవలను ప్రత్యేక ట్రాక్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా భోగాపురం, పూసపాటిరేగ, గరివిడి, చీపురుపల్లి ప్రాంతాలకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని రైతన్నలు ఇప్పటికే వరికంకులను కోసిన వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని సూచించారు.

విశాఖ జిల్లా..

ఈ నెల 4న తుపాను ముందస్తు చర్యల్లో లోతట్టు ప్రాంతాలను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాకు ఇప్పటికే రెండు ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. విశాఖ పర్యాటకులు 4, 5, 6 తేదీల్లో తమ పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అధికారులందరూ అప్రమత్తం కావాలని కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

weather forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్రకు వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.