పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ... అనేక చోట్ల వివాదాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు మన్యంలో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని... ఇది తమ జీవనంపై దెబ్బ వేసినట్టేనని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 70 మందికి వరకూ నివసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్న తమను ఈ రకంగా ఇబ్బందిపెట్టడం తగదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: