ETV Bharat / city

వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాలు.. మరింత సమయం కావాలంటున్న ప్రజలు - visakha latest news

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ రూపొందించిన బృహత్తర ప్రణాళిక ముసాయిదాపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నాయి. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు రేపటితో ముగియనుంది. మరికొంత సమయం కావాలని ప్రజలు కోరుతున్నారు.

vmrda
వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక
author img

By

Published : Jul 30, 2021, 9:46 AM IST

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)-2041 ముసాయిదాపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నాయి. విస్తృతమైన పరిధికి సంబంధించినది కావడంతో ప్రజలు వివరాలు తెలుసుకొని పెద్ద సంఖ్యలో వినతులు అందిస్తున్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఈ నెల 31తో ముగియనుంది.

వాస్తవానికి బృహత్తర ప్రణాళికను దాదాపు వారం రోజుల కిందటే తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలనే డిమాండ్​ ప్రజల నుంచి వస్తోంది. బృహత్తర ప్రణాళిక వివరాలతో పాటు ఆయా మండలాల చిత్రపటాల వివరాలు తెలుగులోకి మార్చారు. వాటిని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం కలిగింది. దీంతో అభ్యంతరాలు తెలియజేసేందుకు మరికొంత సమయం కావాలని కోరుతున్నారు.

వీఎంఆర్‌డీఏ 4873.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి బృహత్తర ప్రణాళిక తయారు చేసింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో 35 మండలాలకు ఇది వర్తించనుంది. ఈ ప్రణాళికలో భూవినియోగ వివరాలతో పాటు ఆయా ప్రాంతాల్లో కొత్త రోడ్లను ప్రతిపాదించారు. ప్రతిపాదిత రోడ్ల కారణంగా ఆయా మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ప్రభావితం అవుతున్నాయి. దీనిపై చాలా గ్రామాల్లోని ప్రజలకు అంత అవగాహన లేదు. తెలుగులోకి తీసుకురావడంతో గ్రామీణ ప్రజలు సైతం చదువుకునేందుకు వీలుగా మారింది. ఈ పరిస్థితుల్లో మరికొంత సమయం ఇవ్వాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు.

మొదట ఆంగ్లంలో

గత నెల 16న బృహత్తర ప్రణాళిక ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. అప్పటి నుంచి నెల రోజుల వరకు అంటే ఈ నెల 16వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ మొదట గడువు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండు మేరకు గడువు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ సమయంలో ప్రణాళికకు సంబంధించిన వివరాలు కేవలం ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంచారు. దీనిపై హైకోర్టులో కేసు వేయడంతో అధికారులు స్పందించి ఆ తరువాత తెలుగులోనూ వివరాలు అందుబాటులోకి తెచ్చారు. మాతృభాషలోకి మార్చిన తరువాత నెల రోజుల గడువు ఇవ్వాలనే డిమాండు ప్రజల నుంచి వినిపిస్తుంది. లేకుంటే దీనిపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పలువురు పేర్కొంటున్నారు.

గడువు పెంచాలి...

మొదట ఆంగ్ల భాషలో ముసాయిదాను అందుబాటులో ఉంచారు. దీనివల్ల మత్స్యకారులు, మురుగువాడల్లో నివసించే ప్రజలకు అర్థంకాని భాషలో ఉంచడం వల్ల ప్రతిపాదించిన ప్రణాళికలు ప్రజలకు సక్రమంగా అర్థమయ్యే అవకాశం లేదు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ అనుకున్న విధంగా ఉపయోగపడకపోవచ్చు. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల తెలుగులోనూ దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ప్రజాభిప్రాయ సేకరణకు మరికొంత సమయం కావాలి. అప్పుడే పూర్తిస్థాయిలో దీనిపై ప్రజలకు ఒక అవగాహన వచ్చి అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఇదీ చదవండి

Vizag Steel plant: కేంద్రం వేసిన పిటిషన్​పై వ్యతిరేకత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.