ETV Bharat / city

వైకాపాలో చేరికపై గంటా గతంలోనే ప్రతిపాదన పంపారు: విజయసాయిరెడ్డి

పార్టీ మార్పుపై గంటా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైకాపాలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపారని స్పష్టం చేశారు. ఆ ప్రతిపాదనను సీఎం జగన్ ఆమోదిస్తే పరిగణనలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

mp vijay sai reddy
mp vijay sai reddy
author img

By

Published : Mar 3, 2021, 10:15 PM IST

గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైకాపాలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపారని స్పష్టం చేశారు. ఆయన ప్రతిపాదనపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ ప్రతిపాదనను సీఎం జగన్ ఆమోదిస్తే పరిగణనలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం వైకాపాకు లేదన్నారు. గంటా వచ్చినా, రాకపోయినా ప్రభుత్వంలో మార్పులు ఉండవని చెప్పారు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

గంటా ఏమన్నారంటే..

తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంటా పార్టీ మారే అవకాశముందటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. విజయసాయిరెడ్డి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయనే చెప్పాలని గంటా పేర్కొన్నారు.

అనుబంధ కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.