విశాఖలో నిర్మిస్తున్న ఎన్ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మంగళవారం పరిశీలించారు. అక్కడి ఇంజినీరింగ్ అధికారులను అడిగి నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొంత శాతం పనులు పూర్తవటంతో రెండు లైన్లు వాహనదారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మిగిలిన పని త్వరగా ముగించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి