వాయుగుండం ప్రభావంతో... సముద్రం ముందుకు వచ్చిందని, మత్స్యకార గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో అన్నారు. నేటి అర్ధరాత్రి తుపాను తీరం దాటనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ తీర ప్రాంత గ్రామాలైన పెదజాలరిపేట, మంగమారిపేట, భీమిలి ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.
తుపాను తీరం దాటే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. మత్స్యకారుల ఇళ్లను మంత్రి పరిశీలించారు. ఎప్పటికప్పుడు వాయుగుండం స్థితిని పర్యవేక్షిస్తూ... జిల్లా యంత్రాంగం మత్స్యకారులకు అప్రమత్తం చేయాలన్నారు. మత్యకారులను వేటకు వెళ్ళొదని సూచించారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదు