ETV Bharat / city

పంచగ్రామాల భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: మంత్రి ముత్తంశెట్టి

విశాఖ జిల్లా సింహాచలంలో సుమారు కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. సింహాచలం పంచ గ్రామాల భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారికి శిక్షపడేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

muttamsetti srinivasrao
muttamsetti srinivasrao
author img

By

Published : Oct 17, 2020, 4:26 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలో పలు అభివృద్ధి పనులకు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు. దేవస్థానం ఆస్తులను ఆక్రమించింది ఎంతటి వారైనా.. ఏ పార్టీ వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. సింహాచలంలో... సుమారు కోటి రూపాయలతో నిర్మించిన సామాజిక భవనం, పైపు లైనులు, రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం సచివాలయ సిబ్బంది సభలో పాల్గొని.. ప్రభుత్వ పథకాలపై చర్చించారు.

అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శంకుస్థాపన

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను వాలంటీర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వైకాపా నాయకులు మంత్రిని గజమాలతో సన్మానించారు.

ఇదీ చదవండి:

కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.