రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్లకు కరోనా సోకింది. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇరువురూ హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలియజేశారు. తనను కలిసేందుకు ఎవరు రావద్దని మంత్రి కోరారు. తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్లో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు