ETV Bharat / city

పద్మనాభంలో అనంత పద్మనాభస్వామి కొండమెట్ల దీపోత్సవం - అనంతపద్మనాభ స్వామి దీపోత్సవం వార్తలు

విశాఖ జిల్లా పద్మనాభంలోని అనంతపద్మనాభ స్వామి కొండమెట్ల దీపోత్సవాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, సింహాచలం ఆలయ ధర్మకర్త సంచయిత గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. 1300 మంది ప్రత్యేక సేవకులతో దీపోత్సవం నిర్వహించారు. కొండమెట్ల మొదటి పావంచా వద్ద నుంచి దీపాలు వెలిగించారు. అంతకుముందు సింహాచలం క్షేత్రపాలకుడైన భైరవ స్వామిని మంత్రి అవంతి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు.

anantapadma nabha swami deepostavam
anantapadma nabha swami deepostavam anantapadma nabha swami deepostavam
author img

By

Published : Dec 14, 2020, 9:31 PM IST

విశాఖ జిల్లా పద్మనాభంలో అనంతపద్మనాభస్వామి కొండమెట్ల దీపోత్సవాన్ని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, సింహాచలం దేవస్థానం ఆలయ ధర్మకర్త సంచయిత గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. తొలి పావంచావద్ద మొదటి దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. 1300 మంది ప్రత్యేక సేవకులతో దీపోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ ఈవో లక్ష్మీనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇచ్చారు.

అనంతపద్మనాభస్వామి కొండమెట్ల  దీపోత్సవం
అనంతపద్మనాభస్వామి కొండమెట్ల దీపోత్సవం

ఆలయ సంప్రదాయం ప్రకారం కొండమెట్ల మొదటి పావంచా వద్ద నుంచి ‌దీపాలు వెలిగించారు. కొండ దిగువన ఉన్న కుంతీమాధవస్వామి ఆలయంలోనూ కొండ పైనున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనూ పురోహితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భూదేవి శ్రీదేవి సమేతంగా అనంత పద్మనాభ స్వామిని గరుడ వాహనంపై ప్రతిష్టించి కుంతీమాధవ స్వామి ఆలయానికి తూర్పు దిశగా ఊరేగించారు. దేవతామూర్తుల విగ్రహాలను మొదటి మెట్టు వద్ద ఆచమనం చేసి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజాలు నిర్వహించారు.

భైరవ స్వామిని దర్శించుకున్న మంత్రి

సింహాచలం క్షేత్రపాలకుడైన భైరవ స్వామిని మంత్రి అవంతి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య కావడంతో భైరవ స్వామికి దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పౌర్ణమి, అమావాస్య సమయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. భైరవ స్వామి ఆలయానికి రహదారి లేదని భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే రహదారి నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

భైరవ స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్న మంత్రి అవంతి

ఇదీ చదవండి : అవే నా ప్రాణాన్ని నిలబెట్టాయి: బండారు దత్తాత్రేయ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.