ETV Bharat / city

అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే.. పరిస్థితేంటి ?: మంత్రి అవంతి

రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే పరిస్థితేంటని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అలాంటి ఇబ్బందులు రాకుండా.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే పరిస్థితేంటి ?

author img

By

Published : Mar 13, 2022, 4:36 PM IST

అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే పరిస్థితేంటి ?

రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే ఇబ్బందులు రాకుండా ఉండేందుకే.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయని మంత్రి తెలిపారు.

"రాజధాని ఆగిందని చాలామంది ప్రచారం చేస్తున్నారు. గతంలో అందరూ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టారు. మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే ఏం చేస్తాం? అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయి. విశాఖ అంటే సీఎం జగన్‌కు అత్యంత ప్రేమ ఉంది. హిందూపురాన్ని జిల్లా చేయాలని బాలకృష్ణ అడిగారు. రైల్వే జోన్, స్టీల్‌ప్లాంట్‌పై భాజపా నేతలు మాట్లాడాలి."

-అవంతి శ్రీనివాస్, మంత్రి

ఇదీ చదవండి

రేపటి సభలో.. అదే చేయబోతున్నా : పవన్‌ కళ్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.