'విశాఖను రాజధానిగా వ్యతిరేకించారనే అడ్డుకున్నారు' - మంత్రి అవంతి శ్రీనివాసరావు న్యూస్
విశాఖలో పేదలకు భూములు పంచడం ఇష్టంలేదని తెదేపా ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పగలరా? అని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబు విశాఖను రాజధానిగా వ్యతిరేకించారు కాబట్టే స్థానికులు ఆయనను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా తానున్నంత వరకూ విశాఖలో అంగుళం కూడా భూమి కబ్జాకానివ్వమన్నారు.