ETV Bharat / city

ఈ పిల్లాడు ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటున్నాడు!

మెున్నటి వరకూ చుట్టూ వంద మంది పిల్లలు. ఇప్పుడు తనలో తాను మాత్రమే. ఏం మాట్లాడుకున్నా తనలోనే... ఆ పిల్లాడికి తెలిసిన భాష.. మిగతావాళ్లకి తెలియని భాష. స్నేహితులు ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూపు.. గేటు చప్పుడైతే ఎక్కడా లేని ఆనందం.. తన ప్రపంచానికి తలుపులు తెరుచుకుంటాయని సంతోషం. కానీ.. వచ్చింది స్నేహితులు కాదని తెలిసి.. జీవితాన్నే ఓడిపోయాననే నిరాశ. లాక్​డౌన్ నేపథ్యంలో మానసికంగా ఎదుగుదల లేని ఓ పిల్లాడు పడుతున్న మనోవేదన.

mentally disabled child problem with lock down

author img

By

Published : Apr 12, 2020, 5:38 PM IST

Updated : Apr 12, 2020, 5:46 PM IST

తనకు తానే.. బాధ, ఓదార్పు

ఆ కుర్రాడిది పాపం, పుణ్యం.. ప్రపంచమార్గం తెలియని చూపులు. రోజూ ఆడుకునే స్నేహితులు ఎందుకు దూరమయ్యారో తెలియని పరిస్థితి. ఒంటరిగా తనలో తానే.. ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటున్నాడు.. ఒక్కోసారి ఏడుస్తున్నాడు. గత నెల 20వ తేదీ వరకూ ఉన్న ఆనందం వేరు... ఇప్పుడు అనుభవిస్తున్న బాధ వేరు. ఇంతకీ బయటేమైందో.. తాను ఉండే ప్రాంతం ఎందుకు ఖాళీ అయ్యిందో.. ఎవరినైనా అడగాలన్నా.. ఏమని ప్రశ్నించాలో తనకేమీ తెలియదు. ఒకవేళ తనకు తెలిసి ప్రశ్నించినా.. అర్థమయ్యేది ఎవరికి? ఒక్కసారి ఆ పిల్లాడి జీవితంలోకి తొంగి చూస్తే.. అతని బాధ ఏంటో అర్థమవుతుంది.

అది విశాఖలోని 'లెబన్ షిల్ఫే' సంస్థ. కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్-ఎంపవర్​మెంట్ శాఖ సహకారంతో నడుస్తోంది. గత నెల 20 వరకూ వంద మంది పిల్లలు చక్కగా ఆడుకుంటూ చదువుకునేవారు. అందులో ఒకరు మణికంఠ. అంతా మానసికంగా ఎదుగుదల లేనివారే. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా ఆ పిల్లల ఆనందాన్ని లాక్కుంది. కరోనా కారణంగా పిల్లలందరినీ వాళ్ల తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. కానీ మణికంఠ ఒక్కడే 'లెబన్ షిల్ఫే' హాస్టల్​లో చిక్కుకుపోయాడు. నాన్న రాలేదు... తనతోనే ఉండే స్నేహితులూ లేరు. అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు.

అయితే.. మణికంఠను తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో సంస్థ యాజమాన్యం ఆ కుర్రాడిని లెబన్ షిల్ఫే హాస్టల్లోనే ఉంచింది. ఉదయం ఇద్దరు ఆయాలు, రాత్రి ఒక ఆయా పరిరక్షణలో, రెండు పూటలా భోజనం పెడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది ? తన స్నేహితులంతా ఎక్కడికి వెళ్లారో అర్ధం కాక ఆ బాలుడు దీనంగా ఎదురు చూస్తున్నాడు.

పెంచే స్తోమత లేక.. వదిలి వెళ్లిన తండ్రి
ఏడేళ్ల వయసులోనే.. మణికంఠ లెబెన్ షిల్ఫేకు వచ్చి చేరాడు. పశ్చిమ గోదావరి ఏలూరుకు చెందిన తన తండ్రికి పెంచే స్తోమత లేక ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

కరోనా మహమ్మారి కారణంగా.. మిగతా పిల్లలను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. మణికంఠ మాత్రం.. స్నేహితులు ఎప్పుడు వస్తారా..? ఎప్పుడు ఆడుకోవాలా? అని తనకు తెలిసిన భాషలో తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.

ఇదీ చదవండి: పిల్లలను గంగానదిలో పారేసిన తల్లి- అయిదుగురు మృతి

Last Updated : Apr 12, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.