ETV Bharat / city

మేఘాద్రిగెడ్డ రిజర్వాయరుకు కాలుష్య ముప్పు - ఏపీ తాజా వార్తలు

విశాఖ తాగునీటి వనరులను కాలుష్య ముప్పు వెంటాడుతోంది. మేఘాద్రిగెడ్డ రిజర్వాయరు నీటిరంగు మారేలా చేయడంతోపాటు ప్రమాదకర జలాలు మిళితమయ్యే గండం పొంచి ఉంది. మరోవైపు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా నడుస్తోంది. ఈనేపథ్యంలో మేఘాద్రిగెడ్డ కాలుష్యం ప్రమాద ఘంటికల్ని మోగిస్తుండటం కలవరపెడుతోంది.

Meghadrigadda
Meghadrigadda
author img

By

Published : Dec 14, 2020, 6:17 PM IST

పూడిక కారణంగా రిజర్వాయరు లోతు తక్కువగా ఉండటంతో నీటిపై కనిపిస్తున్న మొక్కలు

విశాఖ తాగునీటి వనరులో కాలుష్యం ఏరులైపారుతోంది. మేఘాద్రిగెడ్డ రిజర్వాయరు నీటిరంగు మారేలా చేయడంతోపాటు ప్రమాదకర జలాలు కలిసే ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా ఉంది. దీంతో మేఘాద్రిగెడ్డ కాలుష్యం ప్రమాదఘంటికల్ని మోగిస్తోంది.

ఎలా కలుస్తోంది..

మేఘాద్రిగెడ్డ పరిసరాల్లో 3 క్యాచ్‌మెంట్‌ ఏరియాలున్నాయి. ఇందులో ఒకటి నరవ వైపునుంచి, మరొకటి సబ్బవరం వైపునుంచి, ఇంకోంటి కొత్తవలస, పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే నీరు రిజర్వాయరులో కలుస్తోంది. పెందుర్తి పరిసర ప్రాంతాలన్నీ పట్టణీకరణ చెందడం, అటుగా వచ్చే వ్యర్థనీరులో చాలావరకు కాల్వలు మురుగునీటిని మేఘాద్రిగెడ్డలోకి తీసుకొస్తున్నాయి.

కలుషితం చేస్తున్న ప్రాంతాలివీ..

పెందుర్తి మొత్తం పట్టణంతో పాటు, సమీపంలోని పులగానిపాలెం, సుజాతానగర్, వాటి ఎగువ ప్రాంతాల్లోని వ్యర్థనీరు రిజర్వాయరుకు వస్తోంది. ఇళ్లలో వ్యర్థనీరు, వీధుల్లో కలుషితమైంది, అలాగే పలు వాణిజ్యప్రాంతాల నుంచి, చేపల కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ నీరంతా పెద్ద కాల్వల ద్వారా మేఘాద్రిగెడ్డలో కలుస్తున్నాయి.

మేఘాద్రిగెడ్డ రిజర్వాయరుకు కాలుష్య ముప్పు

తీవ్రత బాగా ఎక్కువే..

మేఘాద్రిగెడ్డకు చేరే వివిధ ప్రాంతాల నీటిలో పెందుర్తి వైపునుంచి వచ్చే వ్యర్థనీరు సుమారు నాలుగింట ఒకటోవంతు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఓ చెరువుంది. మురుగునీరు ఆ చెరువులోకి వెళ్లి అక్కడినుంచి మేఘాద్రిగెడ్డకు వస్తున్నట్లు తేలింది. గతంలో జీవీఎంసీ బృందాలు కూడా ఈ వ్యర్థజలాలపై సర్వే నిర్వహించాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

పరిష్కారం ఎలా..

మేఘాద్రిగెడ్డనీరు శుద్ధి ప్లాంట్ల ద్వారా నగరంలో చాలా ప్రాంతాలకు సరఫరా అవుతుంది. అయితే ఈ రిజర్వాయరులోకి వచ్చే ప్రమాదకర వ్యర్థజలాల్ని శుద్ధిచేసే ప్రక్రియ లేదు. పెందుర్తి పరిసర ప్రాంతాలనుంచి వ్యర్థాలు కలిసేచోట ఓ శుద్ధిప్లాంటు పెడితే చాలావరకు సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చవుతుందని వెల్లడిస్తున్నారు. ఇలా కాకపోతే వ్యర్థజలాల్ని దారి మళ్లించాలనే డిమాండ్‌ నడుస్తోంది.

బాబోయ్ పూడిక..

  • రిజర్వాయర్‌లో నీటిమట్టం ఎత్తు 61అడుగులు. కానీ అడుగున 15 అడుగుల మేర పూడికే నిండి ఉందనేది జీవీఎంసీ సర్వేల్లో తేలింది. ఫలితంగా సుమారు 20 శాతం నీటి సామర్థ్యం తగ్గిపోయింది. 1.1 టీఎంసీలకు గాను 0.8-0.9 టీఎంసీల పరిమితం అవుతోంది.
  • సుమారు 600ఎకరాలున్న ఈ రిజర్వాయరు అడుగున లక్షన్నర క్యూబిక్‌మీటర్ల పూడికను ఎలా తీయాలనేది అధికారులకు అంతు చిక్కడం లేదు.
  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక షిప్‌లద్వారా పూడిక తీయాలనుకున్నా..సాధ్యాసాధ్యాలపైనే చర్చ సాగుతోంది.
  • ఈ మొత్తం పనులకు రూ.7కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
  • ఇదే విషయమై ఎస్‌ఈ కె.వేణుగోపాలరావును సంప్రదించినప్పుడు.. ఏం చేయాలనే విషయమే సమాలోచనలు జరుగుతున్నాయని, కొలిక్కి వస్తే ముందుకెళ్తామన్నారు.

ఇదీ చదవండి : సందర్శకులతో సందడిగా టీయూ-142 ప్రదర్శనశాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.