ETV Bharat / city

విశాఖ నగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..! - విశాఖ వార్తలు

విశాఖ నగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి... త్వరలోనే కార్యకలాపాలు ఆరంభమవుతాయని....ఇటీవల పలువురు మంత్రులు, వైకాపా కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళ...పలు పనులను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఇటీవలే కొందరు నేతలు నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

Visakha
విశాఖలో పనులపై ప్రత్యేక దృష్టి
author img

By

Published : Jun 16, 2021, 5:43 AM IST

పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను...మరింత అభివృద్ధి పథంలో నిలిపేందుకు వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో గతంలో వివిధ పనులు చేసిన గుత్తేదారులకు రూ.350 కోట్ల బకాయిలను త్వరగా చెల్లించి ఇక్కడ మౌలిక వసతుల పనుల వేగం పెంచాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య నేతలు విమానాశ్రయం నుంచి నగరంలోకి ప్రవేశించకుండా నగర శివారు ప్రాంతాలకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రహదారిని కేటాయించే ఆలోచనలో యంత్రాంగం ఉంది. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ ప్రాంతాలను కలిపేలా 35 కి.మీ మార్గాన్ని ఇందుకు ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి, ముస్తాబు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి వచ్చినా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

2 కి.మీ మార్గం విస్తరిస్తేనే..
నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ముఖ్యల రాకపోకలు ఉండాలని యోచిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో రోటరీ పై వంతెన పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ (బీఆర్‌టీఎస్‌) ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కి.మీ రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి బాధితులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డును విస్తరించేలా ప్రయత్నాలు చేశారు. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించాలని చర్చలు జరుపుతోంది. అక్కడి నిర్వాసితులతో మంత్రులు చర్చించి పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. బుధవారం దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. అక్కడి గృహాలకు టీడీఆర్‌ ఇవ్వడమా, లేక భూములు ఇవ్వడమా అనే విషయమై చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలని చూస్తున్నారు. ఈ రోడ్డు వివాదం తొలగకున్నా.. రాకపోకలకు ఇబ్బంది ఉండకపోయినా ఇప్పుడున్న ట్రాఫిక్‌ సమస్యలు తొలగాలంటే వెంటనే పరిష్కరించాలని యంత్రాంగం భావిస్తోంది.

పలు ప్రతిపాదనలకు ఆలోచనలు

ప్రస్తుతం అనుకుంటున్న మార్గాన్ని ముస్తాబు చేయడంలో పలు కీలక ప్రతిపాదనలు తెరమీదకి వస్తున్నాయి. వివాదాస్పద 2 కి.మీ. బీఆర్‌టీఎస్‌ రోడ్డుతో కలిపి గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చి నుంచి అడవివరం కూడలి దాకా 6 కి.మీ. మేర మౌలిక వసతుల కల్పనకు యోచిస్తున్నారు. పరిహారం, గృహాల తొలగింపు, విస్తరణ, రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.100 కోట్లకు పైనే కేటాయించేలా సమాలోచనలు నడుస్తున్నాయి. త్వరలో టెండర్లకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇదే మార్గంలో సింహాచలం ఆర్చి సమీపంలో కొండవాలుకు రక్షణగా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మార్గంలో భద్రతాపరంగా ఇబ్బందులు ఎదురవకుండా వస్తున్న సూచనలనూ పరిగణనలోకి తీసుకుని జీవీఎంసీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు విశాఖ బీచ్‌ నుంచి భీమిలి దగ్గరి వరకూ తీరాన్ని ఆనుకుని ప్రస్తుతం 4 వరుసల మార్గం ఉంది. దీనిని కొత్తగా నిర్మించతలపెట్టిన భోగాపురం విమానాశ్రయం వరకూ రూ.1000 కోట్లతో విస్తరించేందుకు ప్రతిపాదనలున్నాయి.

ఇదీ చదవండి:

Property tax: కొత్త పన్ను విధానంపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.