ETV Bharat / city

విశాఖ జిల్లాలో ఘనంగా కార్మిక దినోత్సవం

విశాఖ జిల్లాలో మే డే దినోత్సవాన్ని కార్మిక, కర్షకులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల ఎర్రజెండా ఎగరవేసి ర్యాలీలు చేపట్టారు. కార్మికుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కార్మిక నాయకులు పిలుపునిచ్చారు.

ఘనంగా మే డే దినోత్సవం
author img

By

Published : May 1, 2019, 11:59 AM IST

Updated : May 1, 2019, 3:34 PM IST

ఘనంగా మే డే దినోత్సవం

విశాఖ జిల్లా చోడవరం గ్రామీణ ప్రాంతాలలో మేడే వేడుకలను కార్మికలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగరవేసి ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక శ్రామికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని కార్మిక నాయకులు వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో కార్మికులు, కర్షకులు భారీగా పాల్గొన్నారు.

భీమిలి నియోజకవర్గ పరిధిలో వామపక్ష కార్మిక సంఘాలు వాడవాడలా జెండాలు ఎగురవేశారు. ఆటో కార్మిక నాయకులు జెండా ఎగరవేశారు. తగరపువలసలో ఎర్రజెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను ప్రభత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని నాయకులు కోరారు.

కార్మికుల హక్కుల సాధనలో అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు సి.హెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద మే డే జెండాను ఎగరవేసి కార్మిక వందనం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ అలుపులేని పోరాటం చేస్తుందన్నారు.

ఇదీ చదవండి

నేడు దిశ మార్చుకోనున్న ఫొని... కోస్తాలో అప్రమత్తం

Intro:Ap_vsp_46_01_Vidyardhulaku_yoga_siksana_pkg_ab_c4
విశాఖ జిల్లా అనకాపల్లి లో వేసవి సెలవుల్లో విద్యార్థులకు అందిస్తున్న యోగా శిక్షణ మంచి ఫలితాలనిస్తుంది అనకాపల్లికి చెందిన యువకుడు వెంకట్ యోగాభ్యాసాన్ని చేశాడు తాను నేర్చుకున్న యోగ విద్యను విద్యార్థులకు అందిస్తే బాగుంటన్న ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ఉచితంగా విద్యార్థులకు యోగ శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాదులోని తాను యోగా నేర్చుకున్నా గురూజీ వర్మాజీ ని అనకాపల్లి రప్పించి ఆయనతో గత కొన్నేళ్లుగా విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ చాలామందికి ఉపయోగపడుతుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Body:అనకాపల్లి జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న యోగ శిక్షణలో విద్యార్థులు ఉదయం 8 గంటలనుంచి 10 గంటల వరకు శిక్షణ పొందుతున్నారు. ముందుగా యోగ తరగతులు నిర్వహించి అనంతరం విద్యార్థులతో యోగాసనాలు చేయిస్తున్నారు. విద్యార్థి దశలో యోగ చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని యోగ గురూజీ వెల్లడించారు. వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న యోగ శిక్షణ విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుంది

Conclusion:బైట్1 వెంకట్, యోగ తరగతుల నిర్వాహకుడు
బైట్2 వర్మాజీ యోగ గురువు
Last Updated : May 1, 2019, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.