గంజాయి సాగు నియంత్రణకు పరివర్తన పేరిట పోలీసులు చేస్తున్న దాడులను గిరిజనులు తిప్పికొట్టాలని ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఒక ప్రకటనలో సూచించారు. పరివర్తన కాదు.. ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వం, పోలీసులు, నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు.
ఏజెన్సీలో గంజాయి సాగును మావోయిస్టు పార్టీ ప్రోత్సహిస్తోందని, వ్యాపారం చేస్తుందని పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొదటినుంచి మావోయిస్టు పార్టీ గంజాయి సాగుకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలను తాము ప్రోత్సహిస్తూ.. గంజాయి సాగును నిరుత్సాహపరుస్తున్నామని వివరించారు. భూసమస్యలను పరిష్కరించకుండా గంజాయి సాగు నిరోధానికి దాడులు, అణచివేతలతో అరికట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా గిరిజనులు నష్టపోతూ గంజాయి సాగుపై ఆసక్తి చూపుతున్నారని.. దీనివల్ల బాగుపడింది దళారులు, పోలీసులు మాత్రమేనని గణేష్ ఆరోపించారు.
ఇదీ చదవండి:
SELL AP: ప్రభుత్వం 'సెల్ ఏపీ' పథకాన్ని తీసుకొచ్చింది: ఎంపీ రఘురామ