ETV Bharat / city

'తెలుగు నాయకుల గళం ఎందుకు మూగబోతుంది' - vizag steel plant latest news

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే నాయకులు ఎవరూ స్పందించడం లేదని తెదేపా నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా మాట్లాడిన నేత లేరని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కాకుండా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయపక్షాలు జాతికోసం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.

మండలి బుద్ధ ప్రసాద్
మండలి బుద్ధ ప్రసాద్
author img

By

Published : Feb 5, 2021, 4:23 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసే నిర్ణయంపై తెదేపా నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు నాయకుల గళం ఎందుకు మూగబోతుందని ప్రశ్నించారు. మనలో మనకు ఆత్మాభిమానం ఎందుకు కొడిగట్టిందని నిలదీశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలు పలు అనుమానాలను కలిగిస్తున్నాయని అన్నారు. బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ ఊసు లేకపోయినా గట్టిగా గళమెత్తిన పరిస్థితులు లేవని అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడిన వారు కూడా కంటితుడుపు మాటలు తప్ప.. మన రాష్ట్రానికి న్యాయం చేద్దామనే ఆలోచన అసలు ఏ మాత్రం లేదన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న మండలి బుద్ధ ప్రసాద్

"విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తామంటే మాట్లాడిన నాయకులు లేరు... మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది.. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.. వారు మన కోసం ఆలోచిస్తున్నారని, మనకు న్యాయం జరిగేలా పోరాడుతున్నారని మనం ఆశించడం అడియాశే అవుతుంది. స్వప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్నని వారు గ్రహించే వరకు మన గతి ఇంతే.. వేలాదిమందికి ఉపాధి కల్పించి, విశాఖను మహానగరంగా చేసింది స్టీల్​ ప్లాంట్​. ఇప్పుడూ కోటానుకోట్ల సంపద ప్రైవేటుపరం అవుతుంటే ఎందుకు నోళ్లు మెదపలేకపోతున్నారు?" - మండలి బుద్ధ ప్రసాద్

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అని నా విద్యార్థి దశలో పాల్గొన్నానని బుద్ధ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అన్ని రాజకీయ పక్షాలు జాతికోసం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైనది పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా పోరాడాలని మండలి బుద్ధ ప్రసాద్​ అన్నారు.

ఇదీ చదవండి: 'ఆంధ్రుల హక్కు'కు ముప్పు తప్పదా?.. గనులు కేటాయించి సమస్య పరిష్కరించలేరా?!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.