విశాఖ జిల్లా కంచరపాలెం పోలీసుస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా ఇప్పిలివలసకు చెందిన గణపతి అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. గణపతికి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గణపతి బుచ్చిరాజుపాలెంలోని ఓ కర్రీ పాయింట్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండీ... 'పంచాయతీ ఎన్నికల్లో వైకాపా రౌడీరాజ్యానికి ముక్కుతాడు వేయాలి'