విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో మే 7న విషవాయువు లీక్ అవటంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై ఆరా తీసేందుకు ఎల్జీ పాలిమర్స్ 8 మంది సభ్యులతో కూడిన బృందం మే నెల 13న సౌత్ కొరియా నుంచి వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదవ్వటంతో బృందాన్ని నగరం విడిచి వెళ్లకూడదని విశాఖ జిల్లా కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కొరియా బృందం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా స్వదేశానికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణ కొరియా బయలుదేరారు.
స్వదేశానికి బయల్దేరిన ఎల్జీ పాలిమర్స్ దక్షిణ కొరియా బృందం - ఎల్జీ పాలిమర్స్ వార్తలు
హైకోర్టు ఆదేశాలతో ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించిన దక్షిణ కొరియా బృందం స్వదేశానికి బయలుదేరింది. గ్యాస్ లీకేజీ ఘటనపై కారణాలు తెలుసుకునేందుకు విశాఖకు రాగా వారిని తిరిగి వెళ్లవద్దంటూ జిల్లా కోర్టు ఉత్తర్వులిచ్చింది. స్వ దేశానికి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.