విశాఖలో అప్పల రాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు దుండగులు యత్నించారు. బుధవారం రాత్రి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిల్చుని ఉన్న బాధితుడిని కిడ్నాపర్లు ఆటోలో ఎక్కించారు. బీచ్ రోడ్డు మీదుగా సాగర్ నగర్ వరకు తీసుకెళ్లి విడిచి పెట్టారు. అప్పటికే అతని పొట్టపై కత్తితో గాయాలు చేసి హత్యకు ప్రయత్నించిన నిందితులు అప్పల రాజు నుంచి 6 తులాల బంగారం, లక్ష రూపాయల కు పైగా నగదు దోచుకున్నట్లు తెలుస్తోంది. కైలాసపురానికి చెందిన అప్పల రాజు ఫైనాన్షియర్ గా పని చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'భారీగా తగ్గనున్న వాహనాల డీలర్ల లాభదాయకత'