విశాఖ తీరంలో తితిదే ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరంలో హరిహరుల్ని స్మరించుకుంటూ కార్తిక దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు. దీపోత్సవంలో తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి(Swaroopanandendra saraswati) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి, బెంగళూరులో కార్యక్రమం తలపెట్టినా భారీ వర్షాలతో విశాఖకు మార్చారు.
వివిధ కార్యక్రమాల ద్వారా తితిదే విస్తృతంగా హిందూ ధర్మప్రచారం చేస్తోందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. వేదాలు, పురాణాలను కాపాడటమే కాకుండా భవిష్యత్ తరాలకు అందిస్తోందని కొనియాడారు. కృష్ణా జిల్లా నందిగామలో కోటి దీపోత్సవం(koti deepotsavam in Nandigama) కన్నుల పండువగా నిర్వహించారు. నూజివీడు లలిత పీఠం స్వామీజీ ఆదిత్యానంద భారతి ముఖ్య అతిథిగా హాజరై దీపాలు వెలిగించారు.
ఇవీచదవండి.