ETV Bharat / city

PAWAN KALYAN: స్టీల్‌ప్లాంట్ కార్మికుల తరఫున పోరాటం చేస్తా.. అండగా ఉండండి: పవన్‌

నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో నిర్వహించిన ఉక్కు కార్మికులకు సంఘీభావ సభలో ఆయన ప్రసంగించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం.. అందరిలో భావోద్వేగం నింపిందని వ్యాఖ్యానించారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చిందని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల తరఫున పోరాటం చేస్తానన్న పవన్.. ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FJanaSenaParty%2Fstatus%2F1454743372401295370&widget=Tweet
PAVAN KALYAN
author img

By

Published : Oct 31, 2021, 5:31 AM IST

Updated : Oct 31, 2021, 5:53 PM IST

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి మద్దతుగా జనసేనాని బహిరంగ సభ#JSPForVizagSteelPlant

    Live Link: https://t.co/uGkpTxnPYJ

    — JanaSena Party (@JanaSenaParty) October 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికులు, నిర్వాసితుల నిరసనలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో తలపెట్టిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్... నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేతలకు అభినందనలు తెలిపారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న పవన్ కల్యాణ్.. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం.. అందరిలో భావోద్వేగం నింపిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చేందుకు ఎందరో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉందన్న ఆయన.. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారని చెప్పారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చిందన్నారు.

'ఉక్కు పరిశ్రమ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. భూమి కోల్పోయిన నిర్వాసితులు అనేక కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని అమిత్‌షాను కోరాం. నా వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ప్రజాబలం ఉందనే నాకు ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారు.అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయి. వైకాపా రాజకీయ పరిశ్రమకు తప్ప అన్నింటికీ నష్టాలు ఉన్నాయి' - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

అండగా ఉండండి: పవన్

కార్మిక సంఘాల నేతల పోరాటం వల్లే అనేక పరిశ్రమలు మిగిలాయని పవన్‌ కల్యాణ్ అన్నారు. సమస్యలు వస్తే నిలబడతానని.. పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనకు ముందడుగు వేయడమే తెలుసన్న ఆయన... వెనకడుగు తెలియదని వ్యాఖ్యానించారు. ఉద్దానం ప్రజలు తన కుటుంబసభ్యులా..? అయినా వారి కోసం వెళ్లానని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల తరఫున పోరాటం చేస్తానని.. తనకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన బహిరంగ సభ.. చురుగ్గా ఏర్పాట్లు

Last Updated : Oct 31, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.