కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా కోరడం సహేతుకం కాదని భాజపా నేత రామ్ మాధవ్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు చక్కగా జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కంటే పెద్ద కారణం ఏమైనా ఉందేమో అని అన్నారు. శనివారం విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని... ఏపీలో మాత్రం వచ్చిన సంస్థలు వెనక్కి వెళ్తున్నాయని రామ్ మాధవ్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వివాదాలతో కాలక్షేపం చేయకుండా.. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే విషయం దిల్లీ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఇదీ చదవండి