రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు.. ఉత్తర కోస్తాఆంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అభిప్రాయపడింది. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. రాయలసీమలో ఈ రెండు రోజులూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఈ నెల14 నుంచి 144 సెక్షన్
పశ్చిమ బెంగాల్, సిక్కిం నుంచి దక్షిణ ఛత్తీసగఢ్ వరకు జార్ఖండ్, ఒడిశా మీదుగా ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో... ఉప హిమాలయాల వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
స్పేషియల్ ప్లానింగ్ ద్వారా రెట్టింపు చేపల ఉత్పత్తి: సీఎంఎఫ్ఆర్ఐ