విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హై పవర్ కమిటీ విచారణ మూడో రోజు కొనసాగింది. జీవీఎంసీ సమావేశ మందిరంలో జరిగిన కమిటీ భేటీలో.. ప్రమాదం తర్వాత అధికారులు చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. పత్రికా ప్రతినిధుల అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు.
మూడు రోజుల విచారణలో ఎల్జీ పాలిమర్స్.. అసలు నియమాలు పాటించిందా.. ప్రమాద నివారణకు ఎలాంటి వ్యవస్థ ఉందనే అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. స్టైరీన్ గ్యాస్ వల్ల భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అనే అంశాలను కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన విధానాలను అన్వేషిస్తుంది.
ఇదీ చదవండి: