ETV Bharat / city

నేడు జీవీఎంసీ పాలకవర్గ మూడో సమావేశం

విశాఖ మహానగర పాలక సంస్థ పాలకవర్గ మూడో సమావేశం నేడు జరగనుంది. మేయర్ హరి వెంకట కుమారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఆస్తి పన్ను పెంపు అనంతరం జరుగుతున్న తొలి సమావేశం కావడంతో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.

gvmc
జీవీఎంసీ
author img

By

Published : Jun 23, 2021, 8:31 AM IST

విశాఖ మహానగర పాలక సంస్థ పాలకవర్గ మూడో సమావేశం నేడు జీవీఎంసీ కౌన్సిల్ హాల్​లో జరుగనుంది. మేయర్ హరి వెంకట కుమారి అధ్యక్షతన పాలకవర్గం భేటి కానుంది. కొవిడ్ కారణంగా మృతి చెందిన కార్పొరేటర్లకు సంతాప తీర్మానాన్ని కౌన్సిల్​లో ప్రవేశ పెట్టనున్నారు. ప్రభుత్వం నూతనంగా పెంచిన ఆస్తి పన్ను, వినియోగదారుల ఛార్జీలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొవిడ్-19 వ్యాప్తి నివారణకు మహానగర పాలక సంస్థ తీసుకున్న చర్యల మీద కౌన్సిల్​లో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్దెపై కాకుండా ఆస్తి, మూలధనం విలువ మీద ఆస్తిపన్ను కట్టే విధానం మీద ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీంతో సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

YSR cheyutha: కుటుంబానికి మహిళలే రథసారధులు: సీఎం జగన్

నాలుగు రాష్ట్రాల్లో 'డెల్టాప్లస్​'- థర్డ్​ వేవ్​లో ఇదే ప్రమాదమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.