విశాఖ మహా నగర పాలక సంస్థ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరవాసులపై యూజర్ చార్జీలు, చెత్తపై పన్ను వేయడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. కౌన్సిల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం జీవీఎంసీ పరిధిలో చెత్తపై పన్ను వేసే అంశంపై కౌన్సిల్లో ఓటింగ్ జరిగింది. వైపాకా కార్పొరేటర్లు అనుకూలంగా ఓట్లు వేయడంతో చెత్తపై పన్ను విధించాలని కౌన్సిల్ తీర్మానించినట్లు మేయర్ జి. హరి వెంకట కుమారి పేర్కొన్నారు. దీంతో కొద్దిసేపు తెదేపా, జనసేన, సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. అనంతరం కౌన్సిల్ సమావేశం జరిగింది. జీవీఎంసీ తీర్మానాన్ని పలువురు వ్యతిరేకించారు.
ఇది పన్నులు వేసే సమయం కాదు..
ఇది పన్నులు వేసే సమయం కాదని..కరోనా విపత్కర సమయంలో చెత్తపై పన్ను వేయడం దారుణమని సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ గంగారావు అన్నారు. ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే నవరత్నాలలో ఈ చెత్తపై పన్ను పెట్టి ప్రభుత్వమే ఆ సొమ్మును ప్రజల ఖాతాలో వేయాలన్నారు.
ఛార్జ్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు..
ఈ సమయంలో చెత్తపై పన్ను, వినియోగదారుల ఛార్జ్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని జనసేన కోరింది. ప్రస్తుతం రాబడిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని జనసేన ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ విషయంపై కమిటీ వేసి.. నివేదిక ప్రకారం కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి..